top of page

1965 సిబిఎం హాస్పిటల్ లో నేను జన్మించే నాటికి మా తండ్రి జంపాన వెంకయ్య (వెంకటేశ్వరరావు) గారు మన ఉయ్యూరులోని కూరగాయల మార్కెట్ లో వ్యాపారం నిర్వహించేవారు. నేను తాడంకి జిల్లా పరిషత్ హైస్కూలు లో విద్యాభ్యాసం పూర్తి చేసే నాటికి 1977 యమర్జెన్సీ తరువాత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు మన ఉయ్యూరు లోని ఎ. జి & యస్. జి కాలేజిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నేను రాజకీయాల పట్ల ఆకర్షితుడనైనాను. 1980లో కెసిపి సంస్థలో సామాన్య కార్మికునిగా చేరి అప్పటి జనరల్ మేనేజర్ ఇంజేటి జగన్నాధరావు గారి ఆశీస్సులతో ఉన్నత స్థానానికి చేరుకొని సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులలో బాధ్యతలు నిర్వహించాను. కెసిపి యాజమాన్యము మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలైన పోలియో, కంటి మరియు జనరల్ హాస్పిటల్స్ , మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజి, బస్ షెల్టర్లు, స్కూలు భవనములు, మరుగుదొడ్డు, రహదారులకు ఇరువైపుల మొక్కల పెంపకము మొదలైన వాటిలో విశేష సేవలు అందించాను. 1990 సం|| నుండి ఉయ్యూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలలో పనిచేసితిని. 1995 కెసిపి & కెఐసి ఇండిపెండెంట్ వర్కర్స్ యూనియన్ లో కార్మిక నాయకునిగా గెలుపొంది కార్మిక హక్కుల సాధన కై “ఆమరణ నిరాహార దీక్ష” చేసి యాజమాన్యం చేత 19 డిమాండ్‌లను ఆమోదింపజేసుకున్నాం. 1995 బెజవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాను.

2000 సం|| పశువైద్యశాల అభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పశువులకు మెడికల్ క్యాంపులు నిర్వహించుటకు తోడ్పడినాను. 2003 వ సం|| లో కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారము చేపట్టుటకు నా వంతు కృషి చేశాను. 2004 వ సం|| లో ఉయ్యూరు నియోజకవర్గ ఎసైన్ మెంట్ కమిటి మెంబరుగా నా భార్య నియమించబడి ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాలలోని ప్రజలకు నివేశన స్థలాలు మంజూరుకు సహాయ సహకారములు అందించినాము. 2005లో బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం కెసిపి షుగర్ & ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆడిటోరియంలో బిసి ఐక్య వేదిక సభ నిర్వహించాను. గౌ” ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డా|| వై. యస్ రాజశేఖరరెడ్డి మరియు మా ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు కొలుసు పార్థ సారథి గార్ల సహకారంతో మా స్వగ్రామ మైన గురజాడలో ఇందిరమ్మ పధకం క్రింద నిరుపేదలకు 250 ఇళ్లు మరియు రోడ్ల నిర్మాణము చేసుకున్నాము. 2008వ సం||లో సమాచార హక్కు చట్టం ద్వారా మన ఉయ్యూరు గ్రామ పంచాయతీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చి ఉయ్యూరు గ్రామ ప్రజల మన్ననలు పొందాను. ఉయ్యూరు మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ కాబడే నాటికి రావలసిన పాత బకాయిల పై సమాచారం సేకరించి రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ విభాగమునకు ఫిర్యాదు చేసినాను. వారు షుమారుగా రూ. 8కోట్ల రూపాయల రికవరీకి ఆదేశించినప్పటికీ అధికారులు స్పందించకపోవుటచే వాటిని వసూల్లు చేసి మున్సిపాలిటీని అభివృద్ది పరుచుటకు గౌ” న్యాయస్థానము హై కోర్ట్ నందు రిట్ పిటిషన్ దాఖలు చేసియున్నాను.

YSRGH Logo TELUGU.png
Jampana Kondala Rao
YSRCP Live TV

जम्पान कोंडल राओ

చైర్మన్ - డా|| వై.యస్.ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మాజీ వై.యస్.ఆర్ సిపి అధ్యక్షులు  - ఉయ్యూరు  టౌన్

bottom of page